అందుబాటులో సరిపడా యూరియా
ఖిలా వరంగల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగిలో 1,11,435 ఎకరాల్లో పలు పంటలు సాగవుతున్నాయని, ఇప్పటివరకు 3,56,392 యూరియా బస్తాలు రైతులకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, మార్క్‌ఫెడ్‌లో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, మోతాదుకు మించి రైతులకు యూరియా అందించినట్లు పేర్కొన్నారు.
మైనార్టీలు
దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీలకు సహాయం అందించేందుకు వీలుగా రేవంత్ అన్నా కా సహారా పథకం ద్వారా చేయూత అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఫఖీర్, దూదేకుల, ఇతర దుర్భల ముస్లిం వర్గాలకు చెందిన నిరుద్యోగులకు మోపెడ్లు, బైకులు, ఈ–బైకులు, మహిళలకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ద్వారా ఆర్థిక సహాయం పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అర్హులు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 0870 – 2980533, 93988 60995 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
కొమ్మాల ఆలయ ఆదాయం రూ.3.74 లక్షలు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీలను శనివారం లెక్కించారు. గడిచిన 64 రోజులకు హుండీ ద్వారా రూ.1,09,990, పలు అర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.2,64,644.. మొత్తం రూ. 3,74,634 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు అనిల్‌కుమార్, కొమ్మాల సర్పంచ్ యమునప్రవీణ్, సూర్యతండా సర్పంచ్ రాఘవేంద్ర, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, ఫణీంద్ర, గ్రామపెద్దలు లింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, సిబ్బంది ప్రేమ్‌కుమార్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్
ఖిలా వరంగల్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు అన్నారు. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్‌లో టస్మా, వడుప్సా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వడుప్సా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకతి వీరస్వామి అధ్యక్షతన పదో తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా రంగయ్యనాయుడు హాజరై నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి ఎన్‌ఐఎస్‌ఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పరంజ్యోతి, టస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, గౌరవాధ్యక్షుడు ఆడెపు శ్యామ్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. వడుప్సా పాఠశాలల విద్యార్థులు తమ సందేహలను నివృత్తి చేసుకోవడానికి ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన సబెక్ట్ రిసోర్స్ పర్సన్లు.. పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టస్మా, వడుప్సా ప్రతినిధులు బిల్ల రవి, జ్ఞానేశ్వర్ సింగ్, కోడెం శ్రీధర్, చక్రపాణి, రాజు, వెంకటేశ్వర్లు, కూచన క్రాంతికుమార్, సతీశ్‌మూర్తి, రవీందర్, వెంకట్రాజం, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, మోహన్, విశ్వనాథ్, శరత్‌బాబు, ప్రసాద్ పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్‌జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అందుబాటులో సరిపడా యూరియా


