జిల్లాలో ఐదు లెప్రసీ కేసుల నిర్ధారణ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఐదు లెప్రసీ కేసుల నిర్ధారణ

Jan 6 2026 8:04 AM | Updated on Jan 6 2026 8:04 AM

జిల్లాలో ఐదు  లెప్రసీ కేసుల నిర్ధారణ

జిల్లాలో ఐదు లెప్రసీ కేసుల నిర్ధారణ

జిల్లాలో ఐదు లెప్రసీ కేసుల నిర్ధారణ రేపు జిల్లాస్థాయి సబ్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి.. హాస్టళ్లను ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలి ఐటీఐ విద్యార్థులకు జాబ్‌ మేళా

ఎంజీఎం: జిల్లాలో డిసెంబర్‌ 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌లో ఐదు లెప్రసీ కేసులు గుర్తించి చికిత్స ప్రారంభించినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. జిల్లాలోని 2,10,861 ఇళ్లను సందర్శించి 8,13,286 మందిని సర్వే చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2,582 మందిని ప్రాథమికంగా అనుమానితులుగా గుర్తించగా.. వీరిలో 5 కేసులను నిర్ధారించి చికిత్స ప్రారంభించినట్లు వివరించారు. ఇంకా అనుమానితులకు పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన వారికి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేను అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఎస్‌.శ్రీనివాస్‌, డీపీఎంఓలు సతీశ్‌రెడ్డి, రవీందర్‌ పర్యవేక్షించగా.. ఏఎన్‌ఎంలు, ఆశాలు, తదితరులు పాల్గొన్నట్లు వివరించారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 7వ తేదీన హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సబ్‌జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్‌, ఊర యుగంధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–8, 10, 12, 14, 20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9గంటలకు జనన ధ్రువీకరణ పత్రంతో జేఎన్‌ఎస్‌ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు 98665 64422 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిరుపేద మైనార్టీలకు ‘రేవంత్‌ అన్న కా సహారా’ పథకం ద్వారా సహా యం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్‌హైదర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఫకీర్‌, దూదేకుల, ఇతర దుర్భర ముస్లిం వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మోపెడ్లు, బైకులు, ఈ–బైకులు, మహిళలకు ఇందిరమ్మ మై నార్టీ మహిళా యోజన ద్వారా ఆర్థికసాయం (మహిళలకు మాత్రమే) పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు హనుమకొండ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ 2వ అంతస్తులో గల కార్యాలయంలో గానీ, 95504 49464 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేకాధికారులు నెలలో రెండుసార్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హాస్టల్స్‌లో ఫిర్యాదుల పెట్టె (కంప్లైంట్‌ బాక్స్‌) తప్పనిసరిగా ఉండాలని, దానికి సంబంధించిన తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలన్నారు. రెగ్యులర్‌ హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్యం, శానిటేషన్‌పైన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీచర్లు లేకుండా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు వినాలని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా.. లేదా? అని పరిశీలించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌: ప్రభుత్వ ఐటీఐ వరంగల్‌ ప్రాంగణంలో 2025 వరకు ఐటీఐ వివిధ ట్రేడ్లల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 7వ తేదీ(బుధవారం) జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ వరంగల్‌ ప్రిన్సిపాల్‌ ఎం.చందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఫిట్టర్‌, వెల్డర్‌ అభ్యర్థులను పర్మనెంట్‌ పద్ధతిలో నియమించే అవకాశాలున్నాయని, 2025 వరకు ఐటీఐల్లో ఉత్తీర్ణత పొంది 18 ఏ ళ్లకు పైబడి ఉండాలని, వేతనం రూ.1.90 లక్షలు ఏడాదికి చెల్లిస్తారని తెలిపారు. వసతి, భోజనం సబ్సిడీపై కల్పిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement