ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలి

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలి

ధర్మసాగర్‌: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ హిమబిందు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ‘టీబీ ముక్త్‌ భారత్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీబీ ముక్త్‌ భారత్‌ రెండో దశ కార్యక్రమంలో భాగంగా.. మండలంలోని ధర్మసాగర్‌, ఎల్కుర్తి, మల్లక్‌పల్లి గ్రామాల్లో వంద రోజుల పాటు ఆయుష్మాన్‌ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 ఏళ్లు పైబడిన వారందరినీ సర్వే చేసి లక్షణాలు ఉన్న వారికి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎక్స్‌రే పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీలో 112 మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు. టీబీ ముక్త్‌ భారత్‌ మొదటి ఫేజ్‌లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు హనుమకొండ జిల్లా అవార్డు అందుకున్న సందర్భంగా ధర్మసాగర్‌ పీహెచ్‌సీ సిబ్బంది జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ హిమబిందుని సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణ, పల్లె దవాఖాన డాక్టర్‌ మహేందర్‌ రావు, సూపర్‌వైజర్లు రామ్మోహన్‌, సులోచన, ప్రసన్నకుమారి, సీనియర్‌ అసిస్టెంట్‌ రాధిక, ఆయుష్‌ ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement