న్యూశాయంపేట: షెడ్యూల్డ్ కులాల వార్షిక ప్రణాళిక 2025–26లో పథకాల దరఖాస్తుకు ఈనెల 8వ వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ వరంగల్ జిల్లా కార్యనిర్వహణ సంచాలకుడు సురేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు మరిన్ని పథకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండ సుబేదారి సర్క్యూట్‌హౌస్ రోడ్డులోని తుషారా స్కూల్ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ అర్బన్: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 226 మంది లబ్ధిదారులకు రూ.2,26,26,216 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అదేవిధంగా 176 మందికి రూ.53,25,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.


