మొదలైన ‘మున్సిపాలిటీ’ సందడి | - | Sakshi
Sakshi News home page

మొదలైన ‘మున్సిపాలిటీ’ సందడి

Jan 5 2026 11:26 AM | Updated on Jan 5 2026 11:26 AM

మొదలైన ‘మున్సిపాలిటీ’ సందడి

మొదలైన ‘మున్సిపాలిటీ’ సందడి

నర్సంపేట: ఇటీవల సర్పంచ్‌ ఎన్నికలు ముగిశాయి. మున్సిపాలిటీ ఎన్నికల సందడి మొదలైంది. గతంలో మాదిరిగా బ్యాలెట్‌తోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలుండగా ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కేంద్రంలోని గోదాంలలో భద్రపర్చిన బ్యాలెట్‌ బాక్సుల్లో అవసరమైన వాటిని అధికారులకు అప్పగించనున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా, మొత్తం 41వేల 101మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 21వేల 397మంది ఉండగా, పురుషులు 19వేల 701మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉండగా, మరో ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాలు పెంచాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అదనపు బాక్సుల కోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు అధికారులు విన్నవించగా మరో 12బాక్సులను రిజర్వ్‌లో ఉంచారు. ఒక్కో వార్డులో 1,100నుంచి 1,500 మంది వరకు ఓటర్లు ఉన్నారు.

అత్యల్పం 25వ వార్డు –1,199,

అత్యధికం 13వ వార్డు –1,543

నర్సంపేట పరిధిలో ఉన్న 30వార్డుల్లో 12వ వార్డులో అత్యల్పంగా 1,199మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా 13వ వార్డులో 1,543మంది ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా ఓ ఇద్దరికి రెండు వార్డుల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు మాత్రమే ఫిర్యాదు వచ్చినట్లు మున్సిపల్‌ కమిషన్‌ భాస్కర్‌ వెల్లడించారు.

800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం

72 బ్యాలెట్‌ బాక్సులు

అదనంగా మరో 12 బ్యాలెట్‌ బాక్సులు

నర్సంపేటలో 30 వార్డులు

41,101 మంది ఓటర్లు

19,701 పురుష ఓటర్లు

21,397 మహిళా ఓటర్లు

వార్డుల వారీగా మహిళా, పురుష ఓటర్లు

వార్డు మహిళా పురుష ఇతరులు మొత్తం

ఓటర్లు ఓటర్లు

1 769 760 0 1,529

2 777 670 1 1,448

3 757 676 0 1,433

4 660 622 0 1,282

5 666 585 0 1,251

6 688 577 0 1,265

7 716 601 0 1,317

8 707 621 0 1,328

9 731 714 0 1,445

10 719 644 1 1,364

11 763 680 0 1,443

12 619 598 0 1,217

13 792 751 0 1,543

14 654 648 0 1,302

15 696 634 0 1,330

16 737 709 0 1,446

17 784 732 0 1,516

18 660 607 0 1,267

19 674 639 0 1,313

20 779 718 0 1,497

21 716 693 0 1,409

22 640 583 1 1,224

23 715 696 0 1,411

24 774 713 0 1,487

25 639 560 0 1,199

26 716 681 0 1,397

27 738 668 0 1,406

28 734 630 0 1,364

29 733 686 0 1,419

30 644 605 0 1,249

మొత్తం 21,397 19,701 3 41,101

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement