కార్డులు, చెప్పుల క్యూలైన్
● తెల్లవారుజాము నుంచే యూరియా కోసం
రైతుల పడిగాపులు
గీసుకొండ: మండలంలోని ఊకల్ హవేలి రెవెన్యూ పరిధిలోని రైతులు యూరియా బస్తాల కోసం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద టోకెన్ల కోసం క్యూ కట్టారు. వారు తమ పంట ఆరోగ్య దీపిక కార్డులు, చెప్పులను క్యూలో ఉంచి అధికారుల కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న ఏఓ హరిప్రసాద్ బాబు, తహసీల్దార్ రియాజుద్దీన్.. ఆ గ్రామానికి వెళ్లి వారికి టోకెన్లను పంపిణీ చేశారు. టోకెన్ల ప్రకారం 1,160 యూరియా బస్తాలను ఆది, సోమ వారాల్లో పంపిణీ చేస్తామని ఏఓ పేర్కొన్నారు.


