రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఏర్పాటు చేసిన పోడియంను ఆదివారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్లు సాధారణంగా టేబుల్ ఏర్పాటు చేసుకుని విధులు కొనసాగించాలని, పోడియం అవసరం లేదనే ఆదేశాల మేరకు తొలగించినట్లు సమాచారం.
హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని ఓక్సెన్ యూనివర్సిటీలో ఈనెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు ప్రకటించినట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. టి.మోహన్, టి.కార్తీక్, ఎం.దినేశ్, ఎస్. సుజయ్‌కుమార్, పి.లిఖిత్, ఎస్.నితిక్‌రెడ్డి, నాగచైతన్య, కె.సచిన్, ఎస్.మనోజ్‌కుమార్, రాంలాల్, కె.జ్ఞానేశ్వర్, బి.సాయికుమార్, వి.శ్రావణ్‌కుమార్, జె.వినయ్‌కుమార్, జి.అన్వేశ్, జి.శంకర్‌గౌడ్, టి.సునీల్, కె.విష్ణు, రాజ్‌కుమార్, జె.సాయికుమార్, ఎం.నాగరాజు, యశ్వంత్, బి.కిరణ్ జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఏటీబీటీ ప్రసాద్ కోచ్‌గా, స్టే.ఘన్‌పూర్ విద్యాజ్యోతి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బాలశౌరయ్య మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు..
పంజాబ్‌లోని చండీఘర్ వర్సిటీలో ఈనెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీపతి కోచ్‌కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు


