మహాభాగ్యం.. రుద్రేశ్వరుడి దర్శనం
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్
జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం మహాభాగ్యమని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు ఆయన కూతురుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరస్వామివారికి గోత్రనామాలు, మారేడు దళాలతో మహార్చన చేశారు. అనంతరం ఆలయనాట్య మండపంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకున్న ఎంతోమంది న్యాయమూర్తులు రాష్ట్రస్థాయిలో పదోన్నతి పొందారని, సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని తెలిపారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన వెంట హనుమకొండ సీనియర్ సివిల్‌కోర్టు జడ్జి రామలింగం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు.


