ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి
కాళోజీ సెంటర్ : నూతన సంవత్సర వేడుకలను పురష్కరించుకొని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (డీఆర్‌డీఏ) కార్యాలయంలో గురువారం ఇన్‌చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి.. ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. 2025 సంవత్సరం వైఫల్యాలను సమీక్షించుకొని నూతన సంవత్సరంలో విజయాలు సాధించేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగులు రాంరెడ్డికి బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ రేణుకా దేవి, జి.కొమురయ్య, సారయ్య, ఉద్యోగులు మర్రిదాసు అనిల్ కుమార్, రేవతి, వరలక్ష్మి, సుధాకర్, శ్రీనివాస్, లవకుమార్, వనమ్మ, రంగు కిరణ్, సుధాకర్, రమేష్, రాజీరు, ఏలియా, శ్యాంసన్, మోహన్, బాబు, రాజయ్య, రాజు, రమేష్, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ముసాయిదా
ఓటరు జాబితా విడుదల
వర్ధన్నపేట/నర్సంపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ను గురువారం వర్ధన్నపేట మున్సిపాలిటీలో కమిషనర్ సుధీర్‌కుమార్, నర్సంపేటలో కమిషనర్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు, నర్సంపేట పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి ముసాయిదా జాబితాను తయారు చేసి కార్యాలయం నోటీసు బోర్డులపై ఏర్పాటు చేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ లోపు తెలియజేయాలని సూచించారు.
గుట్టపైకి చేరిన స్వామి
గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి గీసుకొండ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారు, అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకిపై ప్రధాన వీధుల్లో ఊరేగిస్తూ గుట్టపైకి తరలించి అర్చకులు పూజలను నిర్వహించారు. ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సుధాకర్‌రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు వేదాంత మురళీకృష్ణమాచార్యులు, వెంకట నర్సింహాచార్యులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. నూతన సంవత్సరం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. లీకేజీ నీటిలో జళకాలాడుతూ సందడి చేశారు. బోటింగ్ వద్ద పర్యాటకుల తాకిడి నెలకొంది.
ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి
ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలి


