కొనుగోలు కేంద్రాల్లేవ్!
● దుగ్గొండి మండలంలో
ప్రారంభించని అధికారులు
● ధాన్యపు రాశుల వద్ద రైతులకు
తప్పని పడిగాపులు
దుగ్గొండి: వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. మండల వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేటికీ ఒక్క కేంద్రం ప్రారంభించలేదు. మందపల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 15 రోజుల నుంచి వందల మంది రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు. ఆరు ఎకరాల మైదానం నిండా ధాన్యాన్ని రాశులుగా పోసి ప్రతిరోజూ అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగితే రేపుమాపు అంటూ అధికారులు దాటవేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.


