సహకార సంఘాలతో రైతులకు మేలు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● ఊకల్ సొసైటీలో ధాన్యం కొనుగోలు
కేంద్రం ప్రారంభం
గీసుకొండ: సహకార సంఘాలతో రైతులకు ఎంతో మేలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఊకల్ సొసైటీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారదతో కలిసి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగానికి సహకార వ్యవస్థ ఊతం ఇస్తోందన్నారు. ప్రభుత్వం ఆందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, బ్యాంకింగ్ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు చేరుతున్నాయని అన్నారు. సంఘాలను మరింత బలోపేతం చేయాలని, చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన వివరించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో 26 మహిళా డెయిరీ సొసైటీలను రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. నాబార్డు సహకారంతో రైతులకు పలు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఏఓ హరిప్రసాద్‌బాబు, సహకార సంఘాల నోడల్ అధికారి కీరూనాయక్, ఊకల్ సొసైటీ ఎండీ శివ, చైర్మన్ బొమ్మాల రమేశ్, వైస్ చైర్మన్ జనార్దన్, సీఈఓ రమేశ్, మాజీ జెడ్పీటీసీ భీమగాని సౌజన్య, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


