వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 5 2025 4:52 AM | Updated on Sep 5 2025 5:48 AM

ఫార్మసీతో కేయూ ప్రతిష్ట విశ్వవ్యాప్తం కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి – 8లోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
సమాజానికి మార్గనిర్దేశకులు
అంకితభావం.. శ్రీదేవి సొంతం
స్ఫూర్తి ప్రదాత రవికుమార్‌

యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌తో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై

ఉంటుంది. మధ్యాహ్నం వేళ సాధారణంగా

ఉంటుంది. సాయంత్రం సమయంలో

ఆహ్లాదంగా ఉంటుంది.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ లోకో ఇంజనీర్‌ (సీఈఎల్‌ఈ) బీపీఎస్‌.రాథోర్‌ అన్నారు.

గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తాడు. అంతటి ఉన్నత స్థానం కలిగిన ఆయనకు సమాజంలో మంచి స్థానం ఉంది. విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పించి ఉత్తములుగా తీర్చిదిద్దుతాడు. వారి కలలను నిజం చేసే మార్గనిర్దేశకుడు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన బోధన చేస్తున్న పలువురి ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం..

నల్లబెల్లి: మండలంలోని రాంతీర్థం ప్రాథమిక పాఠశాలలో 2022 జనవరిలో హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన ఒడపల్లి శ్రీదేవి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. విద్యార్థుల సంఖ్యను 40 వరకు పెంచారు. మేరుగు రాము–ప్రియాంక దంపతుల ఇద్దరు పిల్లలతో పాటు పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు పంపేవారు. వారికి శ్రీదేవి పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు బంద్‌ చేసి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా రెండు ఽశిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన ఒకే గదితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అందించిన విరాళాలతో మరమ్మతులు చేయించారు. ఈనెల 3న ఎంఈఓ అనురాధ చేతుల మీదుగా హెచ్‌ఎం శ్రీదేవి గదులను ప్రారంభింపజేశారు.

నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన కాసుల రవికుమార్‌ ఖానాపురం మండలం బుధరావుపేట ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన లీడ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి 18 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వ్యక్తిత్వ వికాస తరగతులను బోధిస్తున్నారు. ‘గ్లోబ్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌’ పుస్తకాన్ని విద్యార్థులకు ఉచితంగా అందించారు. తన స్వగృహంలో పిల్లల కోసం సుమారు 30 వేల పుస్తకాలతో లీడ్‌ గ్రంథాలయంతోపాటు లీడ్‌ సంచార గ్రంథాలయం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40కి పైగా లీడ్‌ గ్రామీణ గ్రంథాలయాలను నెలకొల్పారు. గ్రామాల్లోని విద్యార్థుల కోసం తన కారును సంచార గ్రంథాలయంగా తీర్చిదిద్ది, గ్రామీణ ప్రజలకు విద్య ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. సేవా కార్యక్రమాల కోసం రవికుమార్‌ ప్రతీ నెల తన వేతనంలో 33 శాతం కేటాయిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మరిన్ని కథనాలు : 8లో

వరంగల్‌1
1/3

వరంగల్‌

వరంగల్‌2
2/3

వరంగల్‌

వరంగల్‌3
3/3

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement