
పేదలకు మెరుగైన వైద్యసేవలు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి
మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద
● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో
సీటీ స్కాన్ సేవలు ప్రారంభం
నర్సంపేట రూరల్: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. త్వరలోనే మరిన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సీటీ స్కాన్ కోసం ఇకపై వరంగల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నానో యూరియాతో అధిక లాభాలు
పంటలకు నానో యూరియా పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద అన్నారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీపై గురువారం గురిజాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వివిధ పంటలకు నానో యూరియా వాడితే ఖర్చు, శ్రమ తగ్గుతుందన్నారు. యూరియా కంటే నానో యూరియా మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.