
కొండపర్తిలో జెడ్పీ సీఈఓ పర్యటన
ఐనవోలు: మండలంలోని కొండపర్తిలో జెడ్పీ సీఈఓ విద్యాలత శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అదేవిధంగా అంగన్‌వాడీ సెంటర్‌ను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గ్రామం నుంచి పీహెచ్‌సీ వరకు జరుగుతున్న ఎవెన్యూ ప్లాంటేషన్ వద్దకు వెళ్లి జరుగుతున్న పనులను గమనించి మొక్క నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ నక్క కుమారస్వామి, ఈసీ ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, ఎఫ్‌ఏ సుశీల తదితరులు పాల్గొన్నారు.