
టెక్స్‌టైల్ పార్కుకు ఆర్టీసీ బస్సు ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద ఆస్టీసీ బస్సును సోమవారం ప్రారంభించారు. కేఎంటీపీ నుంచి ఊకల్ హవేలి, కొనాయమాకుల, ధర్మారం, జాన్‌పాక మీదుగా వరంగల్ బస్టాండుకు ఆర్టీసీ బస్సు నడుస్తుందని వారు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు కేఎంటీపీ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి కేఎంటీపీకి నడుస్తాయన్నారు. టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామినాయక్, ఆర్టీవో సత్యపాల్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, యంగ్‌వన్, గణేషా కంపెనీ ప్రతినిధులు కృష్ణమూర్తి, ఎంవీ రెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజొద్దీన్, ఎంపీడీవో పాక శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.