
నిట్ ఉన్నతిలో భాగస్వాములు కావాలి
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్‌ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్‌లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్ వరంగల్ ఆడిటోరియంలో మంగళవారం ఓరిఝెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్ వరంగల్‌కు స్వాగతం’ అంటూ విద్యార్ధులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ