
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కేంద్రాల్లో అందిస్తున్న సేవల రికార్డుల నిర్వహణ సరిగా నిర్వహించాలని, మూడు నెలల పూర్తి సమాచారంపై నివేదిక అందించాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి, ిసీడీపీఓలు విశ్వజ, స్వాతి, స్వరూప, పోషణ్ అభియాన్ అధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులు
వేగంగా పరిష్కరించండి
శాయంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన భూ భారతి దరఖాస్తుల్ని వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంతో మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదుట 15 నిమిషాల వరకు కలెక్టర్ వాహనంలో వేచి చూశారు. ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు పరిశీలించారు. అనంతరం మండలంలోని రైతులు భూ సమ్యలపై కలెక్టర్‌కు వినతుల అందించారు. ఆమె వెంట పరకాల ఆర్డీఓ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ ప్రభావతి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి