
కేఎంసీ వసతి గృహాల్లో చెత్త తొలగింపు
ఎంజీఎం: కేఎంసీలోని వసతి గృహాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం తొలగించారు. ‘కేఎంఛీ’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర వైదారోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఆరా తీసింది. మంత్రి పేషీ అధికారులు, డీఎంఈ సైతం సమస్య తీవ్రతను గ్రహించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కేఎంసీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ప్రత్యేక కార్మికులతో వసతి గృహాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేశారు. దోమలు, ఈగలతో వైద్యవిద్యార్థులు విషజ్వరాల బారిన పడకుండా దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలకు సంబంధించిన బడ్జెట్ మంజూరు కోసం కలెక్టర్‌తోపాటు డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా కలెక్టర్ కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కేఎంసీ వసతి గృహాల్లో చెత్త తొలగింపు