
సిద్ధమైన గ్రేటర్ వరంగల్
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆది దేవుడి ఆగమనానికి గ్రేటర్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకులు మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేక నైవేద్యాల నడుమ గణనాథుడు నేడు(బుధవారం) పూజలందుకోనున్నాడు. పత్రి, పూలు, పండ్లు, కొబ్బరికాయ, నైవేద్యాలతో వినాయకుడు కొలువుదీరనున్నాడు. గణేశుడి ప్రతిమలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో మంగళవారం రద్దీ నెలకొంది.
ఎంజీఎం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా గణనాథుల విగ్రహాల విక్రయం
మట్టి ప్రతిమలను పూజిద్దాం
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సిబ్బందికి సూచించారు. వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బుధవారం సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, వెంకటేశ్, నాగయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు సతీశ్, శ్రీధర్, స్వర్జన్ రాజు, ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
● నగరంలో వాడవాడనా మండపాలు
● విద్యుత్ దీపాలతో అలంకరణ
● జోరుగా పూజసామగ్రి, విగ్రహాల కొనుగోళ్లు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు, అధికారులు
● నేటి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం
వేయిస్తంభాల ఆలయంలో..
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మహాగణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. బుధవారం ఉదయం విగ్రహదాత శ్రీకుమార్ రేమండ్స్ షోరూం అధినేత వెనిశెట్టి సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించనున్నట్లు తెలిపారు.
ఉత్సవ నిర్వాహకులు
జాగ్రత్తలు తీసుకోవాలి
ఎన్పీడీసీఎల్ డైరెక్టర్
టి.మధుసూదన్
హన్మకొండ: గణపతి నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. మంగళవారం హనుమకొండలో గణపతి నవరాత్రి ఉత్సవ మండపాలను హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వాహకులు, ఎలక్ట్రిషియన్లకు పలు సూచనలిచ్చారు.
రామన్నపేట: ఖైరతాబాద్ గణపతి తర్వాత వరంగల్‌లోని ఎల్లంబజార్‌లో అదే తరహాలో మహాగణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఈ మండపాల నిర్వహకులు ఆకుతోట సంజీవ్ 40 ఫీట్లతో మట్టి గణపతి ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దానికి అదనంగా మరో ఐదు ఫీట్లకు పెంచి ప్రస్తుతం 45 ఫీట్లతో ఈ గణపతి ప్రత్యేకంగా తయారు చేయించారు. 15 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి గణపతి విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు.

సిద్ధమైన గ్రేటర్ వరంగల్

సిద్ధమైన గ్రేటర్ వరంగల్

సిద్ధమైన గ్రేటర్ వరంగల్

సిద్ధమైన గ్రేటర్ వరంగల్