
వేయిస్తంభాల గుడిలో నవరాత్రి మహోత్సవాలు
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రీమహాగణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా దేవాదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ రామల సునీత తెలిపారు. సోమవారం దేవాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేవాలయంలో రేపటి (బుధవారం) నుంచి సెప్టెంబర్ 5వతేదీ వరకు శ్రీమహాగణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతీరోజు తమగోత్రనామాలతో పూజలు జరిపించుకోవాలనుకునేవారు రూ.2,116 చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు. వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, వెండిలాకెట్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, గట్టు మహేష్‌బాబు, అమ్మవారి ఉపాసకులు సింధుమాతాజీ, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ
అసిస్టెంట్ కమిషనర్ సునీత