
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు..
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 177 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.