కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

Aug 23 2025 6:29 AM | Updated on Aug 23 2025 6:29 AM

కుష్టు రహిత సమాజ  నిర్మాణానికి కృషి చేయాలి

కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి ఐసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ దరఖాస్తుల ఆహ్వానం నేడు ఇన్‌స్పైర్‌పై అవగాహన

ఎంజీఎం: కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కుష్టు నివారణ బృంద సభ్యులు అన్నారు. శుక్రవారం దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బృందం సందర్శించింది. అక్కడి వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిపోర్ట్స్‌, రికార్డ్‌ని పరిశీలించి కుష్టు వ్యాధి సర్వేపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వర చారి, సకలరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీఎంఓ అరుణ సుందర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, జిల్లా లెప్రసీ అధికారి మోహన్‌సింగ్‌, డీపీఎంఓ అనుపమ, వెంకన్న, స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌ భరత్‌ కుమార్‌, నోడల్‌ పర్సన్లు జన్ను కొర్నెల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకు టీజీఐసెట్‌ అభ్యర్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పారంభమైంది. ఈమేరకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో, హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. ఆర్ట్స్‌ కాలేజీలో ధ్రువపత్రాలను ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి అందజేశారు. కేడీసీలో ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గుర్రం శ్రీనివాస్‌ అందజేశారు.

కాజీపేట అర్బన్‌: హనుమకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ప్రేమకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ, పీడీ, స్కూల్‌ అసిస్టెంట్‌, హిందీ పండిట్‌, టీపీ–2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోపు హనుమకొండ అంబేడ్కర్‌ భవన్‌ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

విద్యారణ్యపురి: జిల్లాలోని ఇన్‌స్పైర్‌ మనక్‌ 2025–26పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 23న హనుమకొండలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూళ్లలోని ఇన్‌స్పైర్‌ ఇన్‌చార్జ్‌లు విద్యార్థులతో నామినేషన్లు వేయించేలా శిక్షణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే సమావేశానికి భీమదేవరపల్లి, దామెర, హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట, ఐనవోలు మండలాల ఉపాధ్యాయులు పాల్గొనాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశానికి ఆత్మకూరు, ధర్మసాగర్‌, ఎల్క తుర్తి, కమలాపూర్‌, నడికూడ, పరకాల, శాయంపేట, వేలేరు మండలాల ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్‌లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement