
గత పాలకుల దోపిడీతో దిగజారిన ఆర్థిక స్థితి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: గత పాలకుల దోపిడీతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారి ఆర్థిక పరిస్థితి దిగజారిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల మండలం నాగారం, పోచారం గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలకు, అలియాబాద్ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటలకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ అంచలవారీగా ప్రాధాన్య క్రమంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీను, పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్‌రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.