
ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
కమ్మగోని ప్రభాకర్‌గౌడ్(కొత్తపల్లి), కూస చిరంజీవి (పెరుమాండ్ల గూడెం), గడ్డం రేణుక(ఐనవోలు), బరిగెల ఆనందం (ఐనవోలు), నూనావత్ కీమా (డీసీ తండా), గుంటి కుమారస్వామి (ఇల్లంద), బందెల వెంకన్న (దౌలత్‌నగర్), బోయిని మహేందర్ (వెంకటాపురం), బాలబోయిన రాజయ్య (గర్మిళ్లపెల్లి), మందల నర్సింహారెడ్డి (కొండపర్తి), మడూరి రాజు (పంథిని), ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేశారు. ధరం పూర్ణచందర్ (పర్వతగిరి), దాత సిరిమిల్ల వరలక్ష్మి (రంగారెడ్డి జిల్లా), పోలెపల్లి బుచ్చిరెడ్డి (నర్సింహులగూడెం) ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరు 30 రోజుల్లోపు ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఎండోమెంట్ అధికారులు తెలిపారు.
ఐనవోలు: సుప్రసిద్ధ ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం ధర్మకర్తల పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం జరిగింది. డివిజన్ ఇన్‌స్పెర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు హాజరయ్యారు. ముందుగా.. ధర్మకర్తలతో పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది ధర్మకర్తలకుగాను 12 మంది మాత్రమే హాజరయ్యారు. 12 మందిలో చైర్మన్‌గా కమ్మగోని ప్రభాకర్‌ను సభ్యుడు మడూరి రాజు ప్రతిపాదించగా.. బందెల వెంకన్న బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించారు. దీంతో కమ్మగోని ప్రభాకర్‌ను చైర్మన్‌గా నియమించారు. నేటి నుంచి సంవత్సర కాలం పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఆలయ ఈఓ కందుల సుధాకర్.. కమిటీ సభ్యులను, చైర్మన్‌ను పూలమాలలు వేసి కండువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ చైర్మన్ నాయకులకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సరైన ప్రణాళికలు వేసుకుని నూతన కమిటీతో అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు మండలంలోని ఉడుతగూడెంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలనికి శంశుస్థాపన చేశారు.
చైర్మన్‌గా కమ్మగోని ప్రభాకర్
15 మంది సభ్యులకు 12 మంది హాజరు