
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: రక్షాబంధన్, హయగ్రీవ జయంతి వేడుకలను పు రస్కరించుకుని శనివా రం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి కి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి రాఖీతో అలంకరించారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ వికాస్‌నగర్‌లోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో నిర్వాహకుడు ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి హయగ్రీవ స్తోత్రపారాయణం, అర్చన నిర్వహించారు. అదాలత్ వెనుక ఉన్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీవేంకశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం అర్చకులు దేశికన్ స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయక మిటీ సభ్యులు పాల్గొన్నారు.