
హర్‌ఘర్ తిరంగా వేడుకలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శనివారం హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రామప్పకు వచ్చే పర్యాటకులు, భక్తులు, విద్యార్థులు హర్‌ఘర్ తిరంగా నినాదంతో ఉన్న ఫ్లెక్సీలో నిలబడి సెల్పీలు తీసుకున్నారు. ఈ నెల 15న హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.
స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్‌లో
శిక్షణ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు మేఘనరావు తెలిపారు.
ఉర్సు విజయవంతానికి
సమన్వయం అవసరం
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాజీపేట: అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదేశించారు. కాజీపేట మండలం దర్గా కాజీపేట అఫ్జ్జల్ బియాబానీ దర్గాలో అధికారులతో శనివారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరగనున్న దర్గా ఉత్సవాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మాజీ కార్పొరేటర్ ఎండీ.అబూబక్కర్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, వెంకన్నతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కాజీపేటలో తరచూ
ట్రాఫిక్ జామ్
కాజీపేట: కాజీపేట చౌరస్తాలో శనివారం పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. రాఖీ పౌర్ణమి కావడంతో తోబుట్టువులకు రాఖీలు కట్టడం కోసం వేలాది మంది చౌరస్తా మీదుగా వివిధ వాహనాల్లో రాకపోకలు సాగించారు. దాంతో సిగ్నల్ పాయింట్ వద్ద రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఫాతిమానగర్ బ్రిడ్జి, అటు కడిపికొండ క్రాస్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒకసారి సిగ్నల్ పడి వాహనాలు ఆగితే ఆగిన వాహనాలు సిగ్నల్ దాటడానికి మూడుసార్లు సిగ్నల్ పడడం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న చర్యలు చేపట్టారు. అదనంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు.
108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి●
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఆత్మకూరు: 108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం 108 అంబులెన్స్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో వైద్య పరికరాలు, రికార్డులు పరిశీలించారు. అంబులెన్స్‌లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని సిబ్బంది ఈఎంటీ రమేశ్, పైలట్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ 108 సిబ్బంది సమయానికి చేరుకొని వైద్యసేవలు అందించాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు.

హర్‌ఘర్ తిరంగా వేడుకలు

హర్‌ఘర్ తిరంగా వేడుకలు