
పోలీస్‌స్టేషన్ స్థలాన్ని సందర్శించిన డీసీసీ
ఐనవోలు: మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ గురువారం పరిశీలించారు. గతంలో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం మాత్రమే కేటాయించారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా.. పక్కన ఉన్న మరో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్ సహకారంతో కేటాయించారని అధికారులు డీసీపీకి తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్‌కుమార్ మాట్లాడుతూ త్వరలోనే పోలీస్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ రమేశ్, పర్యతగిరి సీఐ రాజగోపాల్, మామునూరు ఎస్సై శ్రీకాంత్, తహసీల్దార్ విక్రమ్, ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ పాల్గొన్నారు.