
రికార్డ్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్
శాయంపేట: రికార్డ్ చేసిన తర్వాతే సాదాభైనామా దరఖాస్తుల భూములను రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్‌పుస్తకాన్ని అందించాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను, ఫ్యామిలీ మెంబర్ దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనంలో కోడిగుడ్డు ఎందుకు లేదని, గుడ్లు సప్‌లై చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2014 సంవత్సరంలో భూములను కొని 2020 సంవత్సరంలో సాదాభైనామాలో దరఖాస్తు చేస్తుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చలాన కట్టించి రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వైద్యాధికారి సాయికృష్ణ, ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రేవతి, పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ ఉన్నారు.
అప్పుడే సాదాభైనామా దరఖాస్తులకు పాస్‌పుస్తకాలు
అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి
తహసీల్దార్ కార్యాలయం, ఎంజేపీ గురుకుల పాఠశాలలో తనిఖీలు