ప్రజాపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
న్యూశాయంపేట : ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఎం హనుమకొండ జిల్లా విస్తృత సమావేశం గురువారం ఓ ఫంక్షన్‌హాల్ జిల్లా కమిటీ సభ్యుడు రాగుల రమేశ్, జి.రాములు, బి.చక్రపాణిల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుదర్శన్ హాజరై మాట్లాడుతూ..కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు, వాటి అనుబంధ రూల్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందుకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు చుక్కయ్య, జి.వెంకట్, వీరన్న, తిరుపతి, లింగయ్య, భాను నాయక్, మండల, ఏరియా కార్యదర్శులు, గ్రామశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
సుదర్శన్


