ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలి
8,9లోu
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
● గ్రామాల్లో కొలువుదీరిన
నూతన సర్పంచ్‌లు
వర్ధన్నపేట: గ్రామాల్లో కొలువుదీరిన నూతన సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని దమ్మన్నపేట, చంద్రుతండా, అంబేడ్కర్‌నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు, డ్రెయినేజీలు, పచ్చదనం తదితర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు సేవలందిస్తానన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయపర్తి: మండలంలోని బాల్‌నాయక్‌తండా గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికై న భూక్య శ్రీదేవిసమ్మయ్య ప్రమాణస్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొని సర్పంచ్ దంపతులను శాలువాతో సన్మానించారు.
అంచనాలు సిద్ధం చేయండి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్‌లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో అదనపు పైప్‌లైన్‌లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్‌లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కో ట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బల్దియా ఎస్‌ఈ సత్యనారా యణ, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు పాల్గొన్నారు.


