వర్సిటీల సిలబస్ మార్చాలి
● రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్
బాలకిష్టారెడ్డి
కేయూ క్యాంపస్: వర్సిటీలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సిలబస్‌లు మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవారం కేయూలో నిర్వహించిన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ విరామాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలన్నారు. మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలని, జాబ్ మార్కెట్‌కు తగినట్లుగా ఉండాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 వరకు పెంచారన్నారు. అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఫార్మసీలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్స్‌తో ఎంఓయూ ఉందని, విద్యాభివృద్ధికి అధ్యాపకులు ప్రధాన భూమికగా వ్యవహరించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడారు. అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్‌రెడ్డి, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ పాలక మండలి సభ్యులు బి.సురేశ్‌లాల్ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించాలని అకుట్ బాధ్యులు వినతిపత్రం అందించారు.


