మాక్ డ్రిల్ అదుర్స్
వరంగల్: వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, 13వ డివిజన్ నవయుగ కాలనీ లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏడీఎంఏ) ఆదేశాల మేరకు ఒకేసారి వర్షాలు, వరదలు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలని, స హాయక చర్యలు ఎలా నిర్వహించాలనే అంశంపై సోమవారం చేపట్టిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, నవయుగ కాలనీ తదితర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డ్రిల్ సాధారణ పరిశీలకులు గద్వాల డీఎఫ్‌ఓ అశో క్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్, ఏసీపీ శుభం, వరంగల్ ఆర్డీఓ సుమ, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డిలు పర్యవేక్షించారు. వర్షాలతో చెరువు నిండి నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులను, నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని, నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ నుంచి 35 మంది, పోలీస్ శాఖ నుంచి 35, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది 12, ఆపదమిత్ర వలంటీర్లు 30 మంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ సహాయక చర్యలు చేపట్టారు.
డ్రోన్ సహాయంతో ఆహార ప్యాకెట్లు..
వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను సాగించా రు. వరద నీటిలో ముంపునకు గురైన బాధితులు ఇళ్లపైకి చేరగా వారికి ఆహార ప్యాకెట్లతోపాటు నీళ్ల సీసాలను డ్రోన్ల సహాయంతో అందించారు. వరదనీటిలో కొట్టుకుపోతున్న వారిని లైఫ్ బోటుతో రెస్క్యూ బృందం సభ్యులు కాపాడారు. బాధితులకు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం స మీపంలోని దేశాయిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కి 108 వాహనంలో తరలించారు. మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మాక్ డ్రిల్ పరిశీలకులు డీఎఫ్‌ఓ అశోక్‌లు మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, డీఏఓ అనురాధ, వివిధ శాఖల అధికారులు గౌతమ్‌రెడ్డి, కిష్టయ్య, సంధ్యారాణి, సాంబశివరావు, హరీష్‌రెడ్డి, సమ్మయ్య, ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మాక్ ఎక్సర్‌సైజ్
ముంపులో చిక్కుకున్న ప్రజలు, పశు సంపదను కాపాడిన సహాయక బృందాలు
పరిశీలించిన కలెక్టర్ సత్యశారద,
మేయర్ సుధారాణి
మాక్ డ్రిల్ అదుర్స్
మాక్ డ్రిల్ అదుర్స్


