పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ధర్మసాగర్ : పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 32 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మసాగర్, వేలేరు మండలాల తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య


