మెరుగైన వైద్యసేవలందించాలి
గీసుకొండ: ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాలు, పల్లె దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెగుగైన వైద్యసేవలను అందించడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని డీఎంహెచ్‌ఓ బి. సాంబశివరావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ ధర్మారంలోని ఆరోగ్య ఉపకేంద్రం, మహేశ్వరంలోని అంగన్‌వాడీ కేంద్రాలను బుఽ దవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చ ర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చే యించి తగిన చికిత్స అందించాలని సూచించా రు. పిల్లల ఆరోగ్యంపై ఆంగన్‌వాడీ టీచర్లు శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం సఖి సెంటర్ అందిస్తున్న సేవలను వివరించి, పోస్టర్‌ను ఆ యన విడుదల చేశారు.డీఐఓ డాక్టర్ ప్రకాశ్, డెమో అనిల్‌కుమార్, సఖి సెంటర్ కేస్ వర్కర్ స్వప్న, ఉపకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
170 మంది
విద్యార్థుల గైర్హాజరు
కాళోజీ సెంటర్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 170 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 5,096 మంది జనరల్ విద్యార్థులకు 4,961 మంది, 693 మంది ఒకేషనల్ విద్యార్థులకు 658 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
నర్సంపేట: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన చెన్నారావుపేట మండలంలోని తో పనగడ్డతండాలో బుధవారం జరిగింది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.90 వేల విలువ చేసే 35 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. తండాకు చెందిన ఇద్దరిపై కేసు నమోదైనట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు
బావిలో పడి వ్యక్తి మృతి
నర్సంపేట: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తొగరు విజయపాల్‌రెడ్డి (44) నర్సంపేటలో బాలాజీ ఫ్ల్లైవుడ్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, వరి పంటలను సాగు చేశాడు. రోజూ మాదిరిగానే బుధవారం వాకింగ్‌కు వెళ్లి తిరిగి దారిలో ఉన్న తన వ్యవసాయ బావివద్ద మోటారు ఆన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న బూట్లు జారి ప్రమాదవశాత్తు బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటువైపు వెళ్లిన వారు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. మృతుడికి భార్య రాధిక, కుమారుడు కార్తీక్, కుమార్తె మేఘన ఉన్నారు. తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
నేడు విద్యుత్ అంతరాయం
నర్సంపేట: చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని నర్సంపేట ఆపరేషన్ డీఈ తిరుపతి, ఏఈ జోగానంద్ తెలి పారు. చెన్నారావుపేట, ఉప్పరపల్లి, అమీనా బాద్‌లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు అంతరాయం కలుగుతుందని తెలిపారు.
మెరుగైన వైద్యసేవలందించాలి


