ఆత్మకూరు: వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా.. మార్చి 31లోపు 30 ఏళ్లకుపైబడిన వారందరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. మహిళలకు ఆరోగ్య మహిళా క్లినిక్‌లో అందిస్తున్న ఎనిమిది రకాల సేవలపై అవగాహన కల్పించాలన్నారు. ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌లో 3744 బీపీ, 2266 డయాబెటిస్,16 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వీరందరికీ ఫాలో అప్ సేవలు మెరుగ్గా అందించాలన్నారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి చైతన్య, కమ్యునిటీ హెల్త్ అధికారి జునేది సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలతో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌పై జూమ్ సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. హనుమకొండ జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 31లోగా రీ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య


