
కూలీల సమస్యలు తెలుసుకుంటున్న సమ్మయ్య
నల్లబెల్లి: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రుద్రగూడెంలో కొనసాగుతు న్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవా రం సందర్శించారు. కూలీలతో మాట్లా డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో కూలీలకు వసతులు, భద్రత కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటిస్తూ వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడియాల వీరాచారి, కడియాల మనోహర్, ఇస్లావత్ రవి, గంగారపు లింగయ్య, ఈర్ల రవి తదితరులు పాల్గొన్నారు.