‘కొమ్మాల’ ఆదాయం రూ.44.77లక్షలు

ఆలయం వద్ద హుండీ లెక్కిస్తున్న సిబ్బంది  - Sakshi

గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత రెండోసారి హుండీని బుధవారం లెక్కించారు. ఈసారి రూ.9,09,462 ఆదాయం వచ్చిందని ఆయన ఈఓ శేషగిరి తెలిపారు. బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా మొదటిసారి హుండీ లెక్కించగా రూ.15,05,039 ఆదాయం వచ్చిందని, హుండీ, వేలంపాటల ద్వారా మొత్తం కలుపుకుని ఈసారి జాతర ద్వారా రూ.35,68,094 ఆదాయం సమకూరిందని వివరించారు. రెండోసారి హుండీని లెక్కించిన ఆదాయం కలుపుకుని మొత్తం రూ.44,77,556 ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది జాతరలో రూ.30,50,000 ఆదాయం రాగా.. ఈసారి అదనంగా రూ.14,27,555 ఆదా యం వచ్చిందని తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీని వాసాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గడ్డమీది కుమారస్వామి, అర్చకులు రామాచార్యులు, క్లర్క్‌ కనకయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top