భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

ఖిల్లాఘనపురం: ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అప్పారెడ్డిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఎల్‌నినోతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. తాగు, సాగునీటి సంరక్షణ పనులైన ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంలు, నీటికుంటలు, గ్రామాల చివరలో పశువులకు నీటితొట్లు తదితర పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత నివారణకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఖిల్లాఘనపురం గ్రామసభలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య మాట్లాడుతూ.. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు నాగయ్య, పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శులు పృథ్వీకృష్ణ, రవీందర్‌, పలువురు నాయకులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నషాముక్త్‌ భారత్‌ రాష్ట్ర కన్వీనర్‌గా జిల్లా వాసి

వనపర్తి: ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణలో నషా ముక్త్‌ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టిన వీనెట్‌, అలయ్‌బలయ్‌ సంస్థ సంయుక్త విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త పోచ రవీందర్‌రెడ్డిని నియమించారు. మంగళవారం హైదరాబాద్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ చక్రపాణి, మురళి మనోహర్‌, ఆకేళ్ల రాఘవేంద్ర పాల్గొన్నారు.

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

పాన్‌గల్‌: నల్గొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించే అఖిల భారత కిసాన్‌ జాతీయ 36వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.జబ్బార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో పార్టీ నాయకుడు శేఖర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని కొన్నింటిని కరువు మండలాలుగా ప్రకటించి మిగతా వాటిని విస్మరించడం సరికాదని.. కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని, 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా పంిపిణీ చేయాలన్నారు. అఖిల భారత కిసాన్‌ జాతీయ మహాసభలకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ జంబులయ్య, గ్రామ కార్యదర్శి కృష్ణయ్య, నాగన్న, సాయిలు, చిన్నయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement