ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో సైబర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో సైబర్‌ మోసం

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

వనపర్తిటౌన్‌: వ్యాపారులకు ట్రేడ్‌ లైసెనన్స్‌ ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మున్సిపల్‌ అధికారులమంటూ ఫోన్‌చేసి లైసెన్స్‌ బకాయిలు ఉన్నాయని.. తక్షణమే చెల్లింపులు చేయాలంటూ నమ్మిస్తూ వ్యాపారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని కర్నూలు రోడ్‌లో ఉన్న మా మార్ట్‌, మహారాజా ఫర్నీచర్‌ వ్యాపార యజమానులకు ఈ తరహా ఫోన్‌కాల్స్‌ సోమవారం రాగా.. మంగళవారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మా మార్ట్‌ యజమాని శ్రీనివాసులుకు ట్రేడ్‌ లైసెన్‌న్స్‌ బకాయి ఉందని, ఫోన్‌లో పంపించిన క్యూఆర్‌ కోడ్‌కు డబ్బులు పంపిస్తే వెంటనే మంజూరవుతుందని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. దీంతో ఆయన రూ.14,050 చెల్లించగా.. ఎంతసేపటికీ చెల్లింపునకు సంబంధించిన సందేశం రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఫోన్‌ పే ద్వారా చేసిన డబ్బు చెల్లింపు రసీదును పరిశీలించగా ప్రదీప్‌కుమార్‌ సాహూకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. పుర అధికారులను సంప్రదించగా అది సైబర్‌ నేరగాళ్ల మోసపూరిత ప్రయత్నమని తేలింది. ఇదే తరహాలో మహారాజా ఫర్నీచర్‌ యజమాని సుభా్‌కు కూడా ఫోన్‌కాల్‌ రావడంతో అప్రమత్తమైన ఆయన పుర అధికారులకు సమాచారం అందించారు. విచారణలో అది నకిలీ కాల్‌గా గుర్తించారు. ఇలా వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పుర చైర్‌పర్సన్‌ ఎం.మాధవి తన చాంబర్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డితో సమావేశమై సైబర్‌ మోసాలపై వ్యాపారులను అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పేరుతో వచ్చే ప్రతి ఫోన్‌కాల్‌ను నిజమని నమ్మి తొందరపడి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ, పునరుద్ధరణ, బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే నేరుగా పుర కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులతో నిర్ధారించుకోవాలన్నారు. ఫోన్‌కు పంపించే గుర్తుతెలియని లింకులు, క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేయడం, వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు బదిలీ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. ఇంటి పన్ను, కొళాయి బిల్లులు తదితర మున్సిపల్‌ చెల్లింపుల విషయంలోనూ అధికారులను సంప్రదించి ధ్రువీకరించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చైర్‌పర్సన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement