ప్రభుత్వ ధరకే బియ్యం విక్రయించాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ధరకే బియ్యం విక్రయించాలి..

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

వనపర్తి రూరల్‌: జిల్లా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం పెబ్బేరు మండలంలోని సాయి గణేష్‌ రైస్‌మిల్‌, వనపర్తి మండలం నాగవరం గ్రామంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర ఇండస్ట్రీస్‌ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బియ్యం వ్యాపారులు అధిక ధరలకు బియ్యం విక్రయించరాదని.. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, విక్రయ కేంద్రాల నిర్వహణ సజావుగా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా విక్రయాలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రజలు కేంద్రాలను వినియోగించుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం కొనుగోలు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement