వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారులకు ఫోరం అండగా ఉందని.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్)కు పోస్టుకార్డు, ఆన్‌లైనన్‌లో లేదంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సీజీఆర్‌ఎఫ్ రాష్ట్ర చైర్‌పర్సన్ కె.సాయిబాబా అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఆయన నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సదస్సుకు హాజరైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగిన సదస్సులో చైర్మన్‌తో పాటు టెక్నికల్ ఏవీ రమణమూర్తి, మెంబర్ ఫైనాన్స్ శోభారాణి, మెంబర్ కన్‌జ్యూమర్ అఫైర్స్ టి.కోటేశ్వరరావు పాల్గొని వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం తొమ్మిది మంది వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, విద్యుత్ మీటర్ల సమస్యలు, బిల్లుల్లో తప్పులు, కొత్త కనెక్షన్లు, పేరు మార్పిడి, ట్రాన్‌న్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తీగల ఏర్పాటు తదితర సమస్యలపై వేదికను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చిన్నం తాతారావు, డివిజనల్ ఇంజినీర్ ఆపరేషన్ శ్రీనివాస్, డివిజనల్ ఇంజినీర్ టెక్నికల్ వెంకటశివరాం, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ రాంగోపాల్‌శర్మ, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ డి.శ్రీనివాస్‌తో పాటు వనపర్తి సర్కిల్ ఏఈలు, సబ్ ఇంజినీర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కుష్టు సర్వేలో
నిర్లక్ష్యం సరికాదు
కొత్తకోట: కుష్టు సర్వేలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అనుమానితులను గుర్తించి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డా. జాన్‌బాబు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్)లో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పుర కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి కుష్టు గుర్తింపు సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే సిబ్బందితో మాట్లాడి ఇంటింటి సర్వే నిర్వహణ తీరు, అనుమానితులను గుర్తించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని పరిశీలించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వెంకటేశ్వరాచారి, శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ వంశీకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డా. ఆసియా బేగం, పీఎంఓ సులోచన తదితరులు ఉన్నారు.
పరీక్ష ఫీజు అధికంగా వసూలు చేస్తే చర్యలు
వనపర్తిటౌన్: ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థుల నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయించిన పరీక్ష ఫీజులను మాత్రమే వసూలు చేయాలని.. అదనంగా తీసుకుంటే సహించేది లేదని డీఐఈఓ నరేందర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని పేర్కొన్నారు.


