యువత చేతుల్లోనే దేశ భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్‌

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

వనపర్తి: దేశ భవిష్యత్‌ యువత చేతుల్లోనే ఉందని.. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో జిల్లా యువజన మరియు క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ (వీబీవైఎల్‌డీ–2026) సాంస్కృతిక పోటీలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకశక్తి పెంపొందించుకోవాలని కోరారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో యువత కీలకపాత్ర పోషించాలని.. దేశాభివృద్ధిలో భాగస్వాములవుతూ తమ ప్రతిభతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తాయన్నారు. డ్రాయింగ్‌, కవితా రచన, జానపద నృత్యం, నాటకం తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఐఈఓ నరేందర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement