రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

వనపర్తిటౌన్‌: శాసీ్త్రయ ఆలోచనా విధానం, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తూ విద్యార్థులకు దిశా నిర్ధేశం చేయాలని ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్య ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 120 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. న్యాయనిర్ణేతల పరిశీలన అనంతరం ఐదు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ప్రశాంతి, రీనా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ప్రాజెక్టులను పరిశీలించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థుల్లో భవిష్య సాగర్‌ (చాణక్య హైస్కూల్‌, వనపర్తి) సౌమ్య (జెడ్పీ ఉన్నత పాఠశాల, పాన్‌గల్‌), శ్రీజ (మదర్స్‌లాప్‌ హైస్కూల్‌, వనపర్తి), మన్విత (బ్లోజమ్స్‌ హైస్కూల్‌, వనపర్తి), గౌతమి (తెలంగాణ గురుకుల పాఠశాల, కొత్తకోట) ఉన్నారు. అనంతరం ఎంపికై న విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను డీఈఓ అందజేశారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభచాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి శేఖర్‌, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, జిల్లా సైనన్స్‌ అధికారి ఎం.శ్రీనివాసులు, నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్‌న్స్‌ కాంగ్రెస్‌ అకాడమిక్‌ కో–ఆర్డినేటర్‌ బి.కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

● జిల్లా యువజన, క్రీడల అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.

విజేతలు వీరే..

జానపద నృత్యం : నిహారిక బృందం (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తకోట), కావ్య బృందం – తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గోపాల్‌పేట), అక్షిత బృందం (జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, వనపర్తి).

జానపద గీతాలు : టి.కీర్తన (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తకోట), డి.శరణ్య, తులసి (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గోపాల్‌పేట),

చిత్రలేఖనం : ఉమ్మె హాని (జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, వనపర్తి), ప్రభుదాస్‌ (ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వనపర్తి), జి.శ్రీచరణి (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గోపాల్‌పేట)

● వీధి నాటకం ఇందు బృందం (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తకోట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement