తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

వనపర్తి: వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలుచేసి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్లు ఎన్‌.ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ అధికారులు 2027, జూన్‌ వరకు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వీబీజీ రాంజీ పథకంలో భాగంగా కూలీల నమోదుకు సంబంధించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జలసిరి కింద పాంపాండ్లు, ఇంకుడుగుంతలు, బోర్‌వెల్‌ రీచార్జి నిర్మాణాలను ప్రాధాన్యతగా నిర్మించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ యాదయ్య, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల

అదనపు కలెక్టర్‌

ఎన్‌.ఖీమ్యానాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement