మలివిడత షురూ..! | - | Sakshi
Sakshi News home page

మలివిడత షురూ..!

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

ప్రజా ఆమోదంతోనే..

నిశితంగా పరిశీలిస్తున్న

బీఆర్‌ఎస్‌..

మట్టితో నిండిన రహదారి..

జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన రహదారి విస్తరణ పనులు

● ఆక్రమణల తొలగింపునకు

అధికారులు శ్రీకారం

● వాగ్వాదానికి దిగిన బాధితులు

● రంగంలోకి దిగిన పోలీసులు

రహదారి విస్తరణ జిల్లాకేంద్ర ప్రజల చిరకాల వాంఛ. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రహదారి విస్తరణకు సహకరించాలి. విస్తరణలో నష్టపోయే బాధితులకు మేలు చేకూరేలా ఎమ్మెల్యే ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. గతంలో మాదిరిగా కాకుండా ప్రజా ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం.

– ఎం.మాధవి,

పుర చైర్‌పర్సన్‌, వనపర్తి

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలో మలివిడత రహదారి విస్తరణ పనులు గురువారం ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మూడేళ్లుగా నిలిచిన విస్తరణ ప్రక్రియకు అధికారులు అనూహ్యంగా వేగం పెంచారు. భారీ క్రేన్లు, ఇతర యంత్రాల సాయంతో డ్రైనేజీల నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మించిన కట్టడాల తొలగింపు ప్రక్రియను పుర యంత్రాంగం చేపట్టింది. మూడురోజుల కిందట పురపాలికలో రోడ్ల విస్తరణ బాధితులు, వ్యాపారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అర్ధాంతరంగా ముగియడం, కలెక్టర్‌ సైతం అధికారులతో విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి.

వివేకానంద విగ్రహం నుంచి..

మూడేళ్ల కిందట నిలిచిన విస్తరణ పనుల్లో ప్రధానంగా వివేకానంద విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు ఉన్న రహదారి అంశం కీలకంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ మార్గం విస్తరణ ఎట్టకేలకు ప్రారంభం కావడంతో మలివిడత ఆసక్తిగా మారింది. ఈ మార్గం విస్తరిస్తే రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.

మరోవైపు రహదారి విస్తరణ పరిణామాలను విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విస్తరణలో బాధితుల మనోభావాలు దెబ్బతినేలా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయంగా ప్రస్తావించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వ్యూహాలను చిత్తు చేసేలా అధికార పక్షం ప్రతివ్యూహాలు సన్నద్ధం అవుతుండటంతో మలిదశ విస్తరణపై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. త్వరలోనే ఎమ్మెల్యే బాధితులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వపరంగా సాధ్యమయ్యే ప్రతిపాదనలను వారి ముందు ఉంచనున్నట్లు సమాచారం.

ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభం కావడంతో తొలగిస్తున్న మట్టిని పక్కనే పారబోస్తుండటంతో సగం మేర రోడ్డు కుదించుకపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ప్రత్యామ్నాయంగా బస్సు డిపో రోడ్‌ నుంచి బస్సులు, భారీ వాహనాలను దారి మళ్లించినా ట్రాఫిక్‌ కష్టాలు అధికమవుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement