జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

వనపర్తి: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 30వ జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి వికసిత్‌ భారత్‌ యువ నాయకుల సంభాషణ (వీబీవైఎల్‌డీ–2027), జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు 2026–27 నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి టి.సుధీర్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలు నవంబర్‌ 6న ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువత ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు పొందేందుకు ఈ పోటీలు దోహదపడుతాయన్నారు. జానపద నృత్యం, జానపద గీతాలు, పెయింటింగ్‌, వీధి నాటకం, కవిత్వం, రచన అనే అంశాల్లో పోటీలు ఉంటాయని.. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన యువత రాష్ట్రస్థాయి యువనోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న విజేతలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జాతీయస్థాయి పోటీలో పాల్గొనే అవకాశం పొందుతారన్నారు. ఆసక్తిగల యువత https://mybharat.gov.i n/vbyd2027 నందు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. mybharat పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రింట్‌ అవుట్‌, ఆధార్‌కార్డు ప్రతితో పాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను పోటీలు జరిగే రోజున రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద సమర్పించాలని సూచించారు. ఆసక్తి, అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికసంఖ్యలో పాల్గొని తమ ప్రతిభ చాటాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లోని రూం నంబర్‌ 201 లేదా సెల్‌నంబర్లు 98858 51813, 98662 92353 సంప్రదించాలని కోరారు.

చట్టాలపై అవగాహన

ఉండాలి

వనపర్తి రూరల్‌: ప్రతి విద్యార్థికి చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ న్యాయమూర్తి దీప కాసరగడ్డ అన్నారు. గురువారం శ్రీరంగాపురంలోని కేజీవీబీ, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ (పోక్సో చట్టం 2012) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలు, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, బాల్యవివాహాల నిషేధిత చట్టం–2006 ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయిలు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్ట విరుద్దమన్నారు. బాల్య కార్మిక చట్టం కింద 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ రాంబాబు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కృష్ణయ్య, శ్రీదేవి, ఎస్‌ఓ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూసారాన్ని

పరిరక్షించాలి

వనపర్తి రూరల్‌: అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగించడంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ హైమావతి సూచించారు. ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల వ్యవసాయశాఖ అధికారి కురుమయ్య ఆధ్వర్యంలో మండలంలోని నాచహళ్లి, మెంటపల్లిలో సాగుభూమి ఆరోగ్య పరిరక్షణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పచ్చిరొట్ట ఎరువుల సాగు, పంట మార్పిడి, సహజ వ్యవసాయ పద్ధతులను పాటించాలని, పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం, నీటిని పొదుపుగా వినియోగించడం, సమగ్ర పోషకాలు, పురుగుల యాజమాన్య పద్ధతులు పాటించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నాచహళ్లి సర్పంచ్‌ అబ్దుల్లా, మెంటపల్లి సర్పంచ్‌ రాములు, వ్యవసాయ విస్తరణ అధికారులు యుగంధర్‌, కవిత, పంచాయతీ కార్యదర్శి నూతన్‌, శంకర్‌రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement