భూముల రీ–సర్వే పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీ–సర్వే పకడ్బందీగా చేపట్టాలి

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

కొత్తకోట రూరల్‌: భూముల రీ–సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌తో కలిసి మండలంలోని నాంచారమ్మపేటలో కొనసాగుతున్న భూ రీ–సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్లు సర్వే చేస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. రీ–సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను గుర్తించాలని, అనంతరం ప్రభుత్వ భూములు, తర్వాత పట్టా భూములను సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఆక్రమణకు గురైనట్లు గుర్తిస్తే వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, సర్వే పూర్తయిన అనంతరం భూముల వివరాలను రైతులకు తెలియజేసి వారి సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రీ–సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని సూచించారు.

పనులు వేగవంతం చేయాలి..

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీ రింగ్‌ అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సుభాష్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement