వనపర్తి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్రదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరగగా.. ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జి సిద్ధేశ్వర్, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కో–ఆర్డినేటర్ శత్రురావు బుజ్జి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి మండలంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సూచించారు. ఓటరు జాబితా పరిశీలనతో పాటు అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న శ్రీఓట్ బచావో–దేశ్ బచావో’ మహాధర్నాలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంకిని వెంకటేష్, డీసీసీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, పుర చైర్‌పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, పెబ్బేర్ వైస్ చైర్మన్ సుమిత్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, మండల అధ్యక్షుడు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


