పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ

Oct 28 2026 12:42 AM | Updated on Oct 28 2026 12:42 AM

అమరచింత: పట్టణంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు మంజూరైన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఫిర్యాదుపై మంగళవారం ఇన్‌చార్జ్‌ డీఈఓ యాదయ్య విచారణ చేపట్టారు. మండలంలోని ఈర్లదిన్నె, మస్తీపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పీఎంశ్రీ నిధులు గోల్‌మాల్‌ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు పిలిపించి విచారించారు. మొదట అమరచింత పాఠశాలకు మంజూరైన నిధుల వివరాలను ఇన్‌చార్జ్‌ ఎంఈఓ, హెచ్‌ఎం కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఖర్చుల వివరాల రికార్డులను తెప్పించుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. నిధుల అవకతవకలపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చామన్నారు. హెచ్‌ఎం కృష్ణవేణి ఇచ్చిన సమాధానం, ఆమె వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తుందని.. ఖర్చు వివరాల నివేదిక వారం రోజుల్లో అందజేయాలని సూచించినట్లు చెప్పారు. ఫిర్యాదు చేసిన డీవైఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌ఐ సంఘాల నాయకులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు.

సీఆర్పీపై చిందులు వేసిన ఎంఈఓ..

పాఠశాలలో జరుగుతున్న ఘటనలకు సీఆర్పీ స్వామి కారణమంటూ హెచ్‌ఎం, ఇన్‌చార్జ్‌ ఎంఈఓ కృష్ణవేణి డీఈఓ సమక్షంలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల క్లస్టర్‌ సమావేశాల సమయంలో టీ తెప్పించాలని డిమాండ్‌ చేయడం, వీటికోసం నిధులు వస్తాయిగా అని ప్రశ్నించడం ఏమిటని సీఆర్పీపై మండిపడ్డారు. మెమో ఇస్తానని చెప్పడం అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యపర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement