‘ఉపాధి’ లక్ష్యాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ లక్ష్యాలు పూర్తి చేయాలి

Oct 28 2026 12:42 AM | Updated on Oct 28 2026 12:42 AM

వనపర్తి రూరల్‌: వీబీజీ రాంజీ పథకం కింద పాంపాండ్‌ (నీటి కుంటల) నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో పాంపాండ్‌ నిర్మాణ పనులను డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో పనుల పురోగతి వేగవంతం చేసేందుకు కూలీల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరం మేరకు కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ అజహర్‌ మొయినుద్దీన్‌, ఏపీఓ సుకన్య, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ), పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

పిల్లల భద్రత సమాజ బాధ్యత

కొత్తకోట రూరల్‌: పిల్లల హక్కుల పరిరక్షణే సురక్షిత సమాజానికి పునాది అని.. బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప అన్నారు. మంగళవారం కొత్తకోట కేపీఎస్‌ స్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టం–2012పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.దీప, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎం.శ్రీదేవి, కొత్తకోట రెండో ఎస్‌ఐ భాస్కర్‌, వనపర్తి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, పిల్లలకు చట్టం కల్పిస్తున్న రక్షణ, నేరాలకు విధించే శిక్షల గురించి వివరించారు. బాలలపై లైంగిక వేధింపులను గుర్తించడం, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, తమకు ఎదురయ్యే ఇబ్బందులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలబాలికకు సురక్షితమైన వాతావరణంలో జీవించే హక్కు ఉందని.. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పెద్దలకు తెలియజేయాలని, అవసరమైనప్పుడు పోలీసుల సహకారం, న్యాయపరమైన సాయం పొందాలని సూచించారు. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు చట్టాలపై అవగాహన, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, కరస్పాండెంట్‌ డా. ఎద్దుల రాజవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement